భారతదేశం, నవంబర్ 25 -- OTT Today: ఓటీటీలోకి మిడ్ వీక్ లోనూ మంచి మంచి సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. ఈరోజు (నవంబర్ 25) ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, జీ5లాంటి ఓటీటీల్లోకి నాలుగు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. వివిధ జానర్లకు చెందిన ఈ జాబితాలో సైన్స్-ఫిక్షన్, సర్వైవల్ థ్రిల్లర్, కొరియన్ రొమాన్స్, ఫ్యామిలీ అడ్వెంచర్ డ్రామాలాంటివి ఉన్నాయి. మరి అవేంటో ఇక్కడ చూడండి.

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

జానర్: సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ (Sci-Fi Thriller)

హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ 'బ్లేడ్ రన్నర్ 2049' కథకు కొనసాగింపుగా ఈ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ రూపొందింది. గత సినిమాలో జరిగిన సంఘటనల తర్వాత సుమారు 50 ఏళ్ల నాటి భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందో ఇందులో అత్యద్భుతమైన విజువల్స్‌తో చూపించారు.

ఆస్కార్ విజేత మిషెల్ యో (Michelle Yeoh), హం...