భారతదేశం, జూన్ 16 -- OTT Today: తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు (Yogi Babu) లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త వినూత్న పొలిటికల్ అండ్ సోషియో-సాటైర్ కామెడీ డ్రామా 'కెనతా కాణోమ్' (Kenatha Kanom). థియేట్రికల్ రన్ ముగించుకుని ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

థియేటర్లలో అదరగొట్టిన తమిళ సినిమా 'కెనతా కాణోమ్' ఇవాళ (జూన్ 16) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి పాపులర్ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. రూరల్ డ్రామాలు, మిస్టరీని ఇష్టపడే ఓటీటీ లవర్స్ ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

పెద్ద పెద్ద కమర్షియల్ యాక్షన్ సినిమాల మధ్య సైలెంట్‌గా వచ్చి, కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం 'కెనతా కాణోమ్'. ఈ సినిమా కేవలం ఒక రొటీన్ కామెడీ సినిమా కాదు, దీని వెనుక ఒక బలమైన సామాజిక వ్యంగ్యం ఉంది.

ఈ కెనతా కాణోమ్ సినిమాను ఓటీటీలో అస్సలు మిస్ అ...