భారతదేశం, నవంబర్ 8 -- Harsha Vardhan Challenge OTT Streaming From Today: కుటుంబ విలువలు, మానవ సంబంధాలను ప్రతిబింబించే కథలకు తెలుగు తెరపై ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. 'శతమానం భవతి' వంటి జాతీయ అవార్డు పొందిన చిత్రంతో తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన దర్శకుడు వేగేశ్న సతీష్ మరోసారి హృదయానికి హత్తుకునే కథతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఇవాళ (నవంబర్ 8) ఛాలెంజ్ సినిమాతో వచ్చారు.

ఈ ఛాలెంజ్ కథ సీతారామ్ (హర్షవర్ధన్), సుగుణ (మీనా వాసు) దంపతులు, వారి పిల్లలు కిరణ్ (ఉజ్వల్), స్వప్న (హరిణి రెడ్డి)ల చుట్టూ తిరుగుతుంది. ప్రతి ఆదివారం వీక్లీ మ్యాగజైన్స్‌లో వచ్చే పదవినోదంతో సరదాగా గడుపుతుంటాడు. కానీ, ఇల్లాలిగా సుగుణ మాత్రం రోజంతా కష్టపడుతుంటుంది.

సీతారామ్ సండే ఎంజాయ్ చేస్తుంటే.. సుగుణకు మాత్రం పని ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే, ప్రతిరోజు తల్లి పడే శ్రమను పిల...