భారతదేశం, సెప్టెంబర్ 3 -- Gandhari OTT Release Today: ఒకప్పుడు తెలుగులో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటిఫుల్ తాప్సీ పన్ను ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితం అయిపోయింది. బాలీవుడ్‌లో సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటోంది.

అలాంటి తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటించిన హై-వోల్టేజ్ ఎమోషనల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గాంధారి. తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 3) నేరుగా గాంధారి ఓటీటీలోకి వచ్చేసింది. కంటిచూపు పోగొట్టుకున్న కూడా కూతురు ఎక్కడుందో కనిపెట్టేందుకు పోరాటం చేసే తల్లి పాత్రలో తాప్సీ నటించింది.

ఈ చిత్ర కథ అంతా 'బాణి' (తాప్సీ) అనే తల్లి చుట్టూ తిరుగుతుంది. రద్దీగా ఉండే ఒక రైల్వే స్టేషన్‌లో ఆమె చిన్న కూతురు హఠాత్తుగా మాయమవుతుంది. కంటిపాపలా చూసుకునే పాప కనిపించకుండాపోవడంతో బాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.

తన చిన్నా...