భారతదేశం, జూలై 17 -- OTT Today: ఒక్క రోజే హీరోయిన్ గతం మరచిపోవడం, అది కాస్తా హీరోకి వరంగా మారడం అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఏక్ దిన్. సాయి పల్లవి నటించిన తొలి హిందీ మూవీ ఇది. ఈ ఏడాది మే 1న థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ రివ్యూలు సొంతం చేసుకున్న ఈ సినిమా.. మొత్తానికి రెండున్నర నెలల తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ఏక్ దిన్. ఆమిర్ ఖాన్ స్వయంగా ప్రొడ్యూస్ చేసి పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించినా ఫలితం లేకపోయింది. మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఐఎండీబీలోనూ కేవలం 5.8 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది.

అలాంటి మూవీ మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ హిందీ వెర్షన్ తోపాటు తెలుగు, తమిళంలలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సాయి ప...