భారతదేశం, మార్చి 3 -- ఓటీటీ తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈరోజు అంటే మంగళవారం (మార్చి 3) సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి సుమారు ఏడాదిన్నర తర్వాత రావడం విశేషం. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలేంటన్నది ఇక్కడ చూడండి.

సన్ నెక్ట్స్ ఓటీటీలోకి ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. వీటిలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ వంచన, ఫ్యాక్షన్ ఆధారంగా రూపొందిన యాక్షన్ డ్రామా దేవగుడి మరొకటి. ఈ రెండు సినిమాల గురించి సన్ నెక్ట్స్ ట్వీట్ చేస్తూ.. "మీ నెక్ట్స్ బింజ్ వాచ్ ఇప్పుడే మొదలైంది. ఈ కొత్తగా వచ్చిన సినిమాలను సన్ నెక్ట్స్ లో ఇప్పుడే చూడండి" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.

తెలుగులో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ థ్రిల్లర్ వంచన. ఈ సినిమా నవంబర్ 8, 2024న థియేటర్లలో విడుదలై...