భారతదేశం, అక్టోబర్ 26 -- OTT Thrillers: సినిమా మేకింగ్‌లో స్క్రిప్ట్ ఎంత బలమైనదైతే, ఆ సినిమా అంతగా వీక్షకుడి మనసులో నిలిచిపోతుంది. ఇందుకోసం దర్శకులు తరచూ ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందిన 'బెస్ట్ సెల్లింగ్ నవలల' ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తుంటారు. నవలలోని ఊహా ప్రపంచానికి దృశ్యరూపం ఇస్తూ తెరకెక్కించే సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రియుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

వీకెండ్‌లో లేదా ఖాళీ సమయంలో మీ మెదడుకు పనిపెట్టే మైండ్-బెండింగ్ ట్విస్టులు, సస్పెన్స్ డ్రామాను ఆస్వాదించాలనుకుంటే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఈ 5 నవలా ఆధారిత థ్రిల్లర్ మాస్టర్‌పీస్‌లను మీ వాచ్‌లిస్ట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిందే. నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ వేదికల్లో ఉన్న ఈ 5 బెస్ట్ థ...