భారతదేశం, జూలై 3 -- OTT Thrillers: సీడ్ ఎడ్జ్ మీద కూర్చోబెట్ట కోర్టు రూమ్ థ్రిల్లర్లు అంటే మీకు ఇష్టమా? కోర్టు రూమ్ లోని మైండ్ గేమ్స్ నచ్చుతుందా? అయితే ఓటీటీలోని ఈ టాప్ 5 కోర్టు రూమ్ థ్రిల్లర్లను మీరు చూడాల్సిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా ఉంది.

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రాజ్ కుమార్ రావు లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం ఒక లీగల్ మాస్టర్ పీస్. 2010లో ముంబైలో దారుణ హత్యకు గురైన హ్యూమన్ రైట్స్ లాయర్ షాహిద్ అజ్మీ నిజ జీవిత కథ ఆధారంగా హన్సల్ మెహతా ఈ సినిమాను తెరకెక్కించారు.

అమాయకుల తరఫున కోర్టులో నిలబడే లాయర్ షాహిద్.. 2006 ముంబై రైలు పేలుళ్లు, 2008 ముంబై ఉగ్రదాడుల కేసులలో నిందితులుగా ముద్రపడిన ఎంతోమందిని తన వాదనలతో నిర్దోషులుగా ఎలా నిరూపించాడు? చివరకు అతన్ని శత్రువులు ఎలా టార్గెట్ చేశారనేది గుండెల్ని పిండేసేలా ఈ సినిమా చూపిస్తుంది. ...