భారతదేశం, సెప్టెంబర్ 7 -- OTT Thrillers: సస్పెన్స్, క్రైమ్, డ్రామా కథాంశాలను ఇష్టపడే ఓటీటీ ప్రేమికులకు ఈ వారం డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. మైండ్ బ్లోయింగ్ మిస్టరీ, ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన రెండు క్రేజీ తెలుగు వెబ్ సిరీస్‌లు పాపులర్ ఓటీటీ సంస్థ 'జీ5' (ZEE5) వేదికగా డిజిటల్ ప్రసారానికి సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ రెండవ వారంలో సస్పెన్స్ లవర్స్‌ను అలరించబోతున్న ఆ టాప్ 2 సిరీస్‌లు, వాటి కథాంశాల విశేషాలు ఇవే!

90ల నాటి క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్ 'మర్మదేశం' స్ఫూర్తితో తెరకెక్కిన 'వీరభద్రుని రహస్యం' మొదటి భాగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మిస్టరీలోని అసలు నిజాలను వెలికితీసేందుకు 'సీజన్ 1, పార్ట్ 2' సెప్టెంబర్ 9 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

వీరభద్రాపురం అనే గ్రామంలోని ఆలయం దగ్గర వరుసగా జరిగే వింత మరణాలను...