భారతదేశం, మార్చి 17 -- ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ తో తెరకెక్కిన తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఫోర్త్ ఫ్లోర్' మూవీ ఓటీటీలోకి రాబోతుంది. హారర్, మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు వచ్చేస్తుంది. థియేటర్లలో రిలీజైన 21 రోజులకే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుండటం గమనార్హం.

తమిళంలో రీసెంట్ గా థియేటర్లలో ఆడియన్స్ ను భయపెట్టిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'ఫోర్త్ ఫ్లోర్'. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 20 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ ఇవాళ (మార్చి 17) అనౌన్స్ చేసింది. సన్ నెక్ట్స్ లో ఈ థ్రిల్లర్ అందుబాటులోకి రానుంది.

ఫోర్త్ ఫ్లోర్ మూవీ థియేటర్లలో రిలీజైన 21 రోజులకే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో విడుదలైం...