భారతదేశం, జూలై 14 -- OTT Thriller: సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిజిటల్ ఆడియన్స్‌ను థ్రిల్ చేయడానికి 'కమల్ శ్రీదేవి' (Kamal Sridevi) అనే మైండ్ బ్లోయింగ్ కన్నడ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో రెడీ అయింది. బెంగళూరులోని ఒక బిజీ మార్కెట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన శ్రీదేవి అనే మహిళ దారుణ హత్య చుట్టూ ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామా నడుస్తుంది. జులై 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ కన్నడ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మెయిన్ హైలైట్ దీని నెరేషన్ స్టైల్. ఒకే ఒక్క మర్డర్ మిస్టరీని ఏకంగా ఏడుగురు వేర్వేరు వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించబోతున్నారు. సినిమా హిస్టరీలో 'రషోమోన్ ఎఫెక్ట్' అని పిలిచే ఈ స్క్రీన్‌ప్లే ప్యాటర్న్ ఆడియన్స్‌కు నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ప్రతి క్యారెక్టర్ చూసే కోణం మారుతున్న కొద్దీ కిల్లర్ ఎవరనే సస్ప...