భారతదేశం, ఆగస్టు 14 -- OTT Thriller: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు జగపతిబాబు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా భయపెడుతున్నారు. మధ్యలో కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా, లయ హీరోయిన్ గా నటించిన మూవీ 'వదలా'. ఈ చిత్రం ఇవాళ (ఆగస్టు 14) ఓటీటీలోకి వచ్చేసింది.

చాలా కాలం తర్వాత జగపతిబాబు, లయ జంటగా కలిసి నటించిన మూవీ 'వదలా'. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా శుక్రవారం నుంచి డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

వదలా మూవీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఆకెళ్ల వి కృష్ణ‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, లయతో పాటు హృతిక శ్రీనివాస్‌ కీ...