భారతదేశం, ఏప్రిల్ 10 -- OTT Thriller: మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే విభిన్నమైన థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ 'సంభవం: అధ్యాయం ఒన్ను' (Sambhavam Adhyayam Onnu) ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమైంది. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించబోతోంది.

మలయాళీలకు అత్యంత ఇష్టమైన 'విషు' పండుగను పురస్కరించుకుని.. ఈ సంభవం అధ్యాయం ఒన్ను మూవీని ఏప్రిల్ 15న ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ ఉత్కంఠభరిత టైమ్ లూప్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వారికి, ఈ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది గ...