భారతదేశం, అక్టోబర్ 22 -- OTT Thriller: బాక్సాఫీస్ దగ్గర ఒక్కోసారి రివ్యూలకు, కలెక్షన్లకు అస్సలు సంబంధమే ఉండదు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి చెందుతుంది బాలీవుడ్ లేటెస్ట్ జానపద థ్రిల్లర్ 'ది వ్వాన్: ది ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (The Vvaan: The Force of the Forrest).

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ఈ ది వ్వాన్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. జానపద మిస్టరీ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమైంది.

ది వ్వాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ 6, 2026 ను...