భారతదేశం, ఏప్రిల్ 30 -- Aparna Dixit About OTT Thriller Series Hotspot: రాజీవ్ మెండిరట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ సిరీస్ హాట్‌స్పాట్ షూటింగ్ కోసం ఓటీటీ బ్యూటిపుల్ హీరోయిన్ అపర్ణ దీక్షిత్ ఇటీవల లక్నోలో 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ 40 రోజుల అనుభవం తన కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైనదని ఆమె చెబుతున్నారు.

"ఇది నాకు వర్క్ కమ్ వెకేషన్ ట్రిప్‌లా అనిపించింది. నా సొంత ఊరు ఆగ్రాకు దగ్గరగా ఉండటం, నా ప్రాణ స్నేహితురాలు ఇక్కడే ఉండటంతో లక్నో నాకు ఎప్పుడూ ప్రత్యేకం. ఇప్పటికే ఇక్కడ మూడు ప్రాజెక్టులు చేశాను. ఇక్కడికి వస్తే మనసు నిండిపోతుంది" అని అపర్ణ దీక్షిత్ మురిసిపోతూ చెప్పుకొచ్చారు.

గతంలో అపర్ణ దీక్షిత్ 'ఎగ్జిట్' (2022), 'సబ్సే బడా రూపాయి' (2024) వంటి ఓటీటీ సిరీస్‌లతో మెప్పించారు. లక్నో అంటే వెంటనే గుర్తుకువచ్చేది నాన...