భారతదేశం, సెప్టెంబర్ 27 -- OTT Thriller: ఓటీటీలో థ్రిల్లర్లకు కొదవలేదు. మిస్టరీ, సస్పెన్స్, హారర్, క్రైమ్, యాక్షన్.. ఇలా డిఫరెంట్ జోనర్ థ్రిల్లర్లు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ తెలుగు మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ 'కర్మాఖ్య' ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.

కర్మాఖ్య మూవీ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. చనిపోయిన తమ కూతురిని తిరిగి బతికించుకోవడం కోసం ఓ అమ్మాయిని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించే ఓ కుటుంబం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తెలుగులో సినిమాల్లో ఇదే ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది.

కర్మాఖ్య మూవీకి థియేటర్లో పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. జబర్దస్త్ లో అదిరే అభిగా పేరు తెచ్చుకున్న కమెడియన్ అభినయ్ కృష్ణ‌ డైరెక్టర్...