భారతదేశం, అక్టోబర్ 12 -- Enna Vilai OTT Release In Telugu: రామేశ్వరం సముద్ర తీరం నేపథ్యంలో సాగే ఒక సామాన్యుడి పోరాటం ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తమిళ నటుడు కరుణాస్, వర్సటైల్ యాక్ట్రెస్ నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన సోషల్ థ్రిల్లర్ లీగల్ డ్రామా ఎన్న విలై ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఎన్న విలై అంటే ధర ఎంత? లేదా నిజాయితీ (Price Of Dignity) విలువ ఎంత? అనే అర్థాలు వస్తున్నాయి. థియేటర్లలో సెప్టెంబర్ 17న విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ వచ్చింది. అలాంటి ఎన్న విలై ఓటీటీలోకి వచ్చేయనుంది.

"ఒక్క చిన్న బంగారు లాకెట్ ఒక కుటుంబ జీవితాన్నే తలకిందులు చేయగలదా?" అని ప్రశ్నిస్తూ నిర్మాతలు ఓటీటీ విడుదల తేదీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక చిన్న వస్తువు మనిషి నిజాయితీని, అతడి కుటుంబ భవిష్యత్తును ఏ విధంగా పరీక్షించిందో తెలిపే...