భారతదేశం, నవంబర్ 5 -- OTT Thriller: మలయాళ చిత్ర పరిశ్రమలో రూపొందిన భారీ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ 'బాంద్రా' (Bandra) ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మలయాళ స్టార్ హీరో దిలీప్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతోంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 (ZEE5) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రకటిస్తూ, అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసింది.

2023 నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది 'బాంద్రా'. అయితే, అప్పట్లో ఈ చిత్రం థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. సాంకేతిక కారణాలు, విభిన్న సమీకరణాల వల్ల ఈ సినిమా డిజిటల్ విడుదల మూడేళ్లకు పైగా వాయిదా పడుతూ వచ్చి...