భారతదేశం, అక్టోబర్ 5 -- OTT Release: కోలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'పారిస్ కెఫె' (Paris Cafe) ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. రీసెంట్‌గా థియేటర్లలో రిలీజై డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ తమిళ చిత్రం అక్టోబర్ 9 నుంచి ఒకేసారి మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

దర్శకుడు సిరాజ్ సీలన్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థలు దక్కించుకున్నాయి. ఇండియాలోని ఆడియన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) తో పాటు ఆహా తమిళం (Aha Tamil) ప్లాట్‌ఫామ్‌లలో అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఇండియా బయట ఉండే ఓవర్సీస్ తమిళ ఆడియన్స్ కోసం 'సింప్లీ సౌత్' (SimplySouth) ప్లాట్‌ఫామ్‌లో అక్టోబర్ 9 నుంచే ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఒకేసారి మూడు ...