భారతదేశం, నవంబర్ 26 -- OTT Thriller: ఇండియన్ ఓటీటీ రంగంలో సరికొత్త ప్రయోగాలకు వేదికగా నిలుస్తున్న జియోహాట్‌స్టార్ (JioHotstar) ఇప్పుడు ప్రేక్షకులకు ఒక విభిన్నమైన మెడికల్ థ్రిల్లర్ అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అమెరికన్ మెడికల్ డ్రామా 'హౌస్' (House) కు అధికారిక ఇండియన్ అడాప్టేషన్‌గా రూపొందిన 'డాక్టర్ హసన్' (Dr. Hassan) వెబ్ సిరీస్ అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అందాల నటి దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

'జానకి దాస్ రుయా హాస్పిటల్' నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేపుతోంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో టైటిల్ రోల్ అయిన 'డాక్టర్ హసన్' పా...