భారతదేశం, సెప్టెంబర్ 6 -- Gnapakalu OTT Release Today: మనం నివసించే ఇల్లు, వాడే వస్తువులు కేవలం అవసరాల కోసం మాత్రమే కాదు. వాటి వెనుక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, తీపి అనుబంధాలు దాగి ఉంటాయి. నగర జీవితంలో ఎంత బిజీగా మారినా మూలాలను మర్చిపోలేమనే ఆధ్యాత్మిక సత్యాన్ని చాటిచెబుతూ ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సినిమానే జ్ఞాపకాలు.

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్ రూపొందించిన తెలుగు ఎమోషనల్ డ్రామా ఓటీటీ సినిమా జ్ఞాపకాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటోంది.

తల్లిదండ్రుల మరణం తర్వాత కథానాయకుడు శివ తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. తమ పూర్వీకుల ఆస్తిపాస్తులను, ఇల్లును అమ్మేసి శాశ్వతంగా నగరానికి వెళ్లిపోవాలనేది అతని ఆలోచన. ఈ క్రమంలో ఇంట్లోని పాత సామాన్లను సర్దుతుండగా, ఒకప్పుడు తన తండ్రి వాడిన సైకిల్ అతని కంటపడుతుంది.

ఆ పాత సైకిల్‌ను చూడగానే శివ మనసంతా ...