భారతదేశం, మే 3 -- Today OTT Release Telugu Movie Aaradhana: ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉన్నాయి. అలా ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా ఇవాళ (మే 3) తెలుగు లవ్ డ్రామా చిత్రం ఒకటి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే 'ఆరాధన'.

ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, మనసును హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమే ఈ 'ఆరాధన'. సీనియర్ హీరోయిన్ ఆమని, నటుడు సమీర్ జోడీగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యువకులుగా విడిపోయిన ప్రేమ జంట 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది.

ప్రేమ అన్నది కేవలం యవ్వనానికే పరిమితం కాదు, అది జీవితాంతం తోడుండే ఒక అనుభూతి అని 'ఆరాధన' కథ చెబుతుంది. ఒకప్పుడు ప్రాణప్రదంగా ప్రేమించుకున్న కృష్ణ, రాధ కొన్ని అనివార్య కారణాల వల్ల వి...