భారతదేశం, మార్చి 6 -- ఓటీటీలో ప్రతి వారం వివిధ జోనర్లలో, డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ, ఈ వారం ఏకంగా 50 వరకు మూవీస్ ఓటీటీలోకి వచ్చేశాయి. అందులోనూ ఇవాళ అంటే మార్చి 5న ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

వాటిలో చూడాల్సిన కొన్ని తెలుగు మూవీస్ ఓటీటీ ఆడియెన్స్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. అలాంటి వాటిలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన తెలుగు సినిమా ఒకటి ఉంది. ఆ మూవీ పేరే అనగనగా ఆస్ట్రేలియాలో. పూర్తిగా కొత్త నటీనటులతో ఈ సినిమాను రూపొందించారు.

అంతేకాకుండా టైటిల్‌కు తగినట్లుగానే సినిమా షూటింగ్ అంతా ఆస్ట్రేలియాలోనే చేశారు. అంతా కొత్తవారితో, పూర్తిగా ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అంతా కొత్త వాళ్లు కావడంతో ఈ సిని...