భారతదేశం, ఏప్రిల్ 3 -- తెలుగు సినిమా ఒకటి సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. వర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఫస్ట్ టైమ్ దర్శకత్వం వహించిన సినిమా 'ఎస్.సరస్వతి'. ఈ సినిమా ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండానే సడెన్ గా శుక్రవారం (ఏప్రిల్ 3) డిజిటల్ డెబ్యూ చేసింది.

సినిమాల్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడామె మెగా ఫోన్ పట్టింది. ఫస్ట్ టైమ్ సినిమాకు దర్శకత్వం వహించింది. ఆమె డైరెక్ట్ చేసిన 'ఎస్.సరస్వతి' సినిమా ఈ రోజు ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సైలెంట్ గా వచ్చేసింది.

వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన ఎస్.సరస్వతి మూవీ టైటిల్ పై వివాదం రేగింది. ఫస్ట్ ఈ సినిమాకు సరస్వతి...