భారతదేశం, జూన్ 15 -- OTT Telugu: టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రవిబాబు, ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన మూవీ 'రేజర్'. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మే 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మిక్స్‌డ్ టాక్‌తో థియేట్రికల్ రన్‌ను చాలా వేగంగా ముగించుకుంది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా.. ఓటీటీల్లో విభిన్నమైన రా కంటెంట్‌ను ఆదరించే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 'రేజర్' మూవీ డిజిటల్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రాంతీయ ఓటీటీ దిగ్గజం 'ఆహా' (Aha).. అఫీషియల్ స్ట...