భారతదేశం, ఏప్రిల్ 30 -- OTT Telugu: బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న హారర్ థ్రిల్లర్ మూవీ రాకాస, శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా బైకర్.. డిజిటల్ రిలీజ్ కు సిద్దమయ్యాయి. రెండు సినిమాలు ఒకే రోజు ఒకే ఓటీటీలోకి అడుగుపెడుతుండటమే అసలు విశేషం. మే డే హాలీడేతోపాటు లాంగ్ వీకెండ్ నేపథ్యంలో ఈ మూవీస్ ప్రేక్షకులను బాగా అలరించనున్నాయి. మరి ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'రాకాస'. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే నవ్వించింది. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 1) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఈ రాకాస మూవీ కథ విషయానికి వస్తే.. అమెరికా నుంచి పెళ్లి కోసం సొంతూరికి వచ్చిన ఓ యువకుడు, అనుకోకుండా...