భారతదేశం, మే 5 -- OTT Telugu: 'మసూద', 'మంగళవారం' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'పాపం ప్రతాప్'. గ్రామీణ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. మే 7 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

'పాపం ప్రతాప్' చిత్రానికి సంబంధించిన పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ (ఓటీటీ హక్కులు) ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) సొంతం చేసుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా మే 7 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

"పాప్‌కార్న్ రెడీ.. ప్లే బటన్ కూడా రెడీ.. మే 7 నుంచి.. పాపం ప్రతాప్ కాదు వీర ప...