భారతదేశం, జూలై 23 -- OTT Telugu: బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన తెలుగు యూత్‌ఫుల్ థ్రిల్లర్ మూవీ 'యూఫోరియా' (Euphoria 2026) ఓటీటీలో రచ్చ కొనసాగిస్తోంది. ఐదున్నర కింద థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు నాలుగో ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను జియోహాట్‌స్టార్ లో నాలుగు భాషల్లో చూడొచ్చు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం వెర్షన్లు కూడా అందుబాటులోకి రావడంతో మూవీ రీచ్ మరింత పెరగనుంది.

ప్రముఖ సినిమా రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఏకంగా 7.5 రేటింగ్ సాధించిన ఈ ఇంటెన్స్ యూత్ డ్రామా డిజిటల్ స్పేస్‌లో మైండ్ బ్లాకింగ్ వ్యూయర్‌షిప్ సాధిస్తోంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, డ్రగ్స్ కల్చర్, ఓ రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

భూమిక, సారా అర్జున్ లాంటి వాళ్లు నటించిన యుఫోరియా మూవీ ఇప్పటి...