భారతదేశం, మే 18 -- OTT Telugu: టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ 'జెట్లీ'. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందు టాలీవుడ్ సర్కిల్స్‌లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

కమెడియన్ సత్య హీరోగా, వెన్నెల కిశోర్ మరో ప్రధాన పాత్రలో నటించిన'జెట్లీ' ఓటీటీ స్ట్రీమింగ్ ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రం మే 25, 2026న ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 'జెట్లీ' డిజిటల్ ప్రీమియర్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మే 25, 2026 నుంచి జెట్లీ మూవీ జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది....