భారతదేశం, ఆగస్టు 4 -- OTT Telugu: టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ (Thiruveer), సంక్రాంతికి వస్తున్నాం భామ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన కామెడీ డ్రామా 'ఓ సుకుమారి' (Oh Sukumari) డిజిటల్ ప్రీమియర్ డేట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. జులై 17, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశ పరిచింది.

బిగ్ స్క్రీన్ పై అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

ఈ ఓ సుకుమారి మూవీ ఆగస్టు 7, 2026 నుంచి ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ వీక్షకులకు అందుబాటులోకి రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుండటం విశేషం.

థియేటర్లలో సరైన ప్రమోషన్లు లేకపోవడం, మిక్స్‌డ్ టాక్ రావడం వల్ల బాక్స...