భారతదేశం, జూలై 30 -- OTT Telugu: ఈ వారం ఓటీటీలోకి చాలా సినిమాలే వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ 'దీవానా' డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ రోజే ఓటీటీలో అడుగుపెట్టింది. కానీ స్ట్రీమింగ్ లో ఓ ట్విస్ట్ ఉంది.

ఇటీవలి కాలంలో తెలుగు ఓటీటీ రంగంలో ప్లాట్‌ఫామ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో, డిజిటల్ సంస్థలు తమ సబ్‌స్క్రైబర్లను నిలబెట్టుకోవడానికి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) తన 'ఆహా గోల్డ్' (Aha Gold) సభ్యుల కోసం అందిస్తున్న 'అర్లీ యాక్సెస్' (Early Access) ఫీచర్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన పొందుతోంది.

ఇందులో భాగంగా తాజాగా ఇంటెన్స్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన 'దీవానా' (Deewana) చిత్రం ఆహాలో ప్రీమియర్‌కు వచ్చేసింది. సాధా...