భారతదేశం, ఏప్రిల్ 24 -- OTT Telugu: లేటెస్ట్ తెలుగు యూత్ రొమాంటిక్ లవ్ స్టోరీ 'బ్యాండ్ మేళం' ఓటీటీలోకి వచ్చేసింది. కోర్ట్ మూవీతో పాపులర్ అయిన జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం ఇవాళ (ఏప్రిల్ 24) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మరోసారి తమ కెమిస్ట్రీతో రోషన్, శ్రీదేవి అలరించారు.

యంగ్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన తెలుగు మూవీ బ్యాండ్ మేళం. ఈ సినిమా శుక్రవారం ఓటీటీలో అడుగుపెట్టింది. నేటి నుంచే జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.

''నిరీక్షణ ముగిసింది. బ్లాక్ బస్టర్ జోడీ తిరిగొచ్చింది. జీ5లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న బ్యాండ్ మేళం మూవీని చూసేయండి'' అని జీ5 తెలుగు తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.

నాని ప్రొడ్యూసర్ గ...