భారతదేశం, జూలై 16 -- OTT Telugu: ఓటీటీలో ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ కోసమే రెండు లేటెస్ట్ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని గంటల్లో అంటే ఈరోజు అర్ధరాత్రి దాటగానే ఈ రెండు మూవీస్ స్ట్రీమింగ్ రాబోతున్నాయి. వీటిలో ఒకటి మా ఇంటి బంగారం కాగా.. మరొకటి వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.

'పెళ్లి', కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు లాంటి క్లాసిక్ హిట్స్‌తో ఆ రోజుల్లో యూత్‌ను ఊపేసిన వడ్డే నవీన్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత లీడ్ రోల్‌లో అలరించేందుకు రెడీ అయ్యారు. ఆయన నటించిన కొత్త యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ఈ శుక్రవారం అంటే జులై 17 నుంచి జీ5 ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమాలో రాశీ సింగ్ ఫీమేల్ లీడ్‌గా నటించింది.

ఇంటిల్లిపాదీ కలిసి హాయిగా నవ్వుక...