భారతదేశం, మార్చి 27 -- థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్‌ను సదరు ప్లాట్‌ఫామ్స్ లేదా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తారు. కానీ, కొన్నిసార్లు మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సర్‌ప్రైజ్ ఇస్తూ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి.

ఇప్పుడు అలాంటి సినిమా గురించే తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలైన కేవలం 2 వారాల్లోనే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సడెన్‌గా ఇవాళ (మార్చి 27) ఓటీటీలోకి వచ్చింది ఓ తెలుగు మూవీ. ఆ సినిమానే "రేపు ఉదయం 10 గంటలకు". తెలుగులో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా "రేపు ఉదయం 10 గంటలకు" మూవీ తెరకెక్కింది.

ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్, చైతన్య రావు, అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, సాహితి అవంచ, వాసు ఇంటూరి, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. 'ఓ పిట్ట కథ'...