భారతదేశం, నవంబర్ 10 -- OTT Telugu: ఓటీటీలోకి ఈవారం ఓ తెలుగు మూవీ రెండు ఓటీటీల్లోకి ఒకే రోజు అడుగుపెడుతోంది. ఆ సినిమా పేరు హ్యాపీ జర్నీ. ఈ ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొదట కేవలం సన్ నెక్ట్స్ లోకి వస్తుందని భావించినా.. తాజాగా ఈటీవీ విన్ కూడా మూవీ స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించింది.

సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్‌ నెక్ట్స్'తో పాటు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'లలో ఈ సినిమా నవంబర్ 13 నుంచి అందుబాటులోకి రానుంది.

సన్‌నెక్ట్స్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లభ్యం కానుండగా, ఈటీవీ విన్‌లో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా అలరించనుంది.

అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, యంగ్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ సహా పలువురు కీల...