భారతదేశం, జూలై 16 -- OTT Telugu: తెలుగు డిజిటల్ విండోలో భారీ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే.. మట్టి వాసన ఉన్న కథలు, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రాలకే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రేజ్‌ను పక్కాగా క్యాష్ చేసుకుంటూ 'ఈటీవీ విన్' సరికొత్త రూటెడ్ డ్రామాతో మన ముందుకు వచ్చింది. ఆ సినిమానే 'మధురాపురి సదన'.

ఓటీటీలోకి ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. లెక్కలేనన్ని మూవీస్ స్ట్రీమింగ్ లో ఉన్నాయి. అయితే వీటిలో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలకు, మిడిల్ క్లాస్ స్టోరీగా రిలేటడ్ గా ఉండే సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సినిమానే 'మధురాపురి సదన' ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (జూలై 16) నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

'మధురాపురి సదన' సినిమా పూర్తిగా ఒక మధ్యతరగతి కుటుంబం, వారి కలలు, అనుబంధాలు, సొంత ఇల్లు/గ...