భారతదేశం, మే 20 -- OTT Telugu: ఓటీటీలోకి ఇవాళ ఓ తెలుగు మూవీ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన కేవలం 12 రోజులకే ఈ మూవీ డిజిటల్ డెబ్యూ చేయడం గమనార్హం. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్‌ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సతీ లీలావతి' అప్పుడే డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది.

మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన తొలి తెలుగు మూవీ 'సతీ లీలావతి'. ఈ మూవీ ఇవాళ (మే 20) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా డిజిటల్ డెబ్యూ చేసింది.

థియేటర్లలో విడుదలైన కేవలం 12 రోజుల వ్యవధిలోనే సతీ లీలావతి సినిమా ఓటీటీ బాట పట్టడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెగా ఫ్యామిలీకి చెందిన ఒక నటుడు లేదా నటి నటించి...