భారతదేశం, నవంబర్ 9 -- OTT Telugu: ఇటీవలి కాలంలో విభిన్నమైన కథాంశాలతో, జీవితానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలతో తెరకెక్కే చిత్రాలకు డిజిటల్ వేదికలపై విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా స్నేహం, ప్రయాణం, మహిళల ఆత్మవిశ్వాసం నేపథ్యంలో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ వరుసలోనే సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైంది 'హ్యాపీ జర్నీ' (Happy Journey).

హాయిగా నవ్వుకునే కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్‌ నెక్ట్స్' (Sun NXT) లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 18న థియేటర్లలో రిలీజై ఐఎండీబీలో ఏకంగా 9.7 రేటింగ్ సాధించింది.

'హ్యాపీ జర్నీ' చిత్రం ప్రధానంగా ఒక ఆల్-వుమెన్ హాలిడే (All-women holiday) ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. వేర్వేరు మనస్తత్వాలు, వేర్వేరు నేపథ్యాలు ఉన్న కొందరు మహిళలు కలసి ఒక ప...