భారతదేశం, జూలై 25 -- OTT Series Blade Runner 2099 Teaser Released: హాలీవుడ్ సినీ ప్రపంచంలో సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన ఐకానిక్ ఫ్రాంచైజ్ 'బ్లేడ్ రన్నర్'. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ దిగ్గజ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు తొలిసారిగా ఒక లైవ్-యాక్షన్ వెబ్ సిరీస్ రాబోతోంది.

'బ్లేడ్ రన్నర్ 2099' (Blade Runner 2099) పేరిట రూపొందుతున్న ఈ ఎనిమిది ఎపిసోడ్ల లిమిటెడ్ సిరీస్ అధికారిక టీజర్‌ను అమెజాన్ ఎంజీఎమ్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ (Comic-Con) ఈవెంట్‌లో శనివారం (జూలై 25) విడుదల చేసింది.

'బ్లేడ్ రన్నర్ 2049' చిత్రం ముగిసిన 50 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా ఈ ఓటీటీ సిరీస్ కథ సాగుతుంది. మానవాళి రహితంగా సరికొత్తగా పునర్నిర్మితమైన భవిష్యత్ లాస్ ఏంజిల్స్ నగర నేపథ్యాన్ని ఇందు...