భారతదేశం, నవంబర్ 3 -- OTT Tamil: తమిళ చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడూ వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలను, సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో ముందుంటుంది. ఇటీవల కాలంలో మూస పద్ధతికి భిన్నంగా, సామాజిక సందేశంతో పాటు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచే చిన్న బడ్జెట్ సినిమాలు, కొత్త దర్శకుల ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది కంటెంట్ ఓరియెంటెడ్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్' (The Grand Master).

థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక సన్ నెక్స్ట్ (SunNXT)లో నవంబర్ 6 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం, నటీనటుల పనితీరు ఎలా ఉందో ఒకసారి రివ్యూలో చూద్దాం.

'ది గ్రాండ్ మాస్టర్' మూవీ ప్రధాన...