భారతదేశం, అక్టోబర్ 22 -- OTT Tamil: వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న తమిళ నటుడు, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి (Vijay Sethupathi). విలక్షణమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ఆయన లేటెస్ట్ ఫీల్-గుడ్ డ్రామా 'బత్తా' (Baththa). థియేటర్లలో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. ఈ పండుగ సీజన్ కానుకగా అక్టోబర్ 29 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్‌లు ఏకకాలంలో ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి రాను...