భారతదేశం, అక్టోబర్ 15 -- OTT Tamil: కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎమోషనల్ అండ్ మ్యూజికల్ డ్రామా 'చారుకేశి' (Charukesi) తెలుగు వెర్షన్ ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. బాషా, అరుణాచలం వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు సురేష్ కృష్ణ (Suresh Krissna) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ ఆడియన్స్‌కు అందుబాటులోకి వచ్చింది.

సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ (YG Mahendran) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన అలనాటి స్టార్ హీరోయిన్ సుహాసిని (Suhasini) కథానాయికగా కనిపించారు.

ఈ సినిమా కథ మొత్తం కర్ణాటక సంగీత విద్వాంసుడు చారుకేశి (వైజీ మహేంద్రన్) జీవితం చుట్టూ తిర...