భారతదేశం, నవంబర్ 12 -- OTT Suspense Thriller: ఓటీటీలోకి సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ది బ్లైండ్ గేమ్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రియమణి, అర్జున్ రాంపాల్ నటించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎలా ఉంది? చూడాలా వద్దా అన్నది ఈ రివ్యూలో తెలుసుకోండి.

ఈ సినిమా కథ హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన మనాలి నేపథ్యంలో మొదలవుతుంది. ఒక కేసు విషయంలో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ సికందర్ (అర్జున్ రాంపాల్) అక్కడ నివసిస్తుంటాడు. ఒకరోజు రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కారణంగా విక్కీ, షాన్ అనే ఇద్దరు యువకులతో సికందర్‌కు పరిచయం ఏర్పడుతుంది.

మొదట అది ఒక సాధారణ యాక్సిడెంట్‌లా కనిపించినా, ఆ ఇద్దరు యువకులు ఏదో పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారని సికందర్ అనుభవం చెబుతుంది. ఆరా తీయగా.. విక్కీ, షాన్, వారి స్నేహితుల బృందానికి, మాయమైన రూ. 5 కోట్ల...