భారతదేశం, నవంబర్ 8 -- Anireekshita Atithigalu OTT Release: వెండితెరపై విజయం సాధించిన విభిన్నమైన కథాంశాలకు ఓటీటీ వేదికలు సరికొత్త ఆదరణ కల్పిస్తున్నాయి. థియేటర్లలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అనుభూతిని అందించిన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'అనిరీక్షిత అతిథిగలు' (Anireekshita Atithigalu) ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

అనిరీక్షిత అతిథిగలు అంటే అనుకోని అతిథులు లేదా ఊహించని అతిథులు అనే అర్థం వస్తుంది. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన అనిరీక్షిత అతిథిగలు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే, ఐఎమ్‌డీబీలో 9.5 రేటింగ్ సంపాదించుకోవడమే కాకుండా సస్పెన్స్ ప్రియుల ప్రశంసలు అందుకుంది.

బుల్లితెర, వెండితెరపై నటుడిగా మంచి గుర్తింపు పొందిన వివేక్ సింహ ఈ అనిరీక్షిత అతిథిగలు చిత్రంలో కథానాయకుడిగా నటించారు. థియేటర్లలో చూడటం మిస్...