భారతదేశం, అక్టోబర్ 13 -- OTT Show: బుల్లితెరపై సంచలనం సృష్టించిన సెలెబ్రిటీ టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా విత్ జగపతి' (Jayammu Nischayammu Raa Season 2) ఇప్పుడు సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. విలక్షణ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ పాపులర్ టాక్ షో గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు సౌత్ ఇండియా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) మొదటి గెస్ట్‌గా హాజరై సందడి చేశారు.

ఎప్పుడూ సినిమాల ప్రమోషన్లలో గంభీరంగా మాట్లాడే సాయి పల్లవి, ఈ షోలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను, కెరీర్ ముచ్చట్లను చాలా ఓపెన్‌గా పంచుకున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా అక్టోబర్ 16, 2026 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుండగా, అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కాను...