భారతదేశం, జూలై 4 -- UP Police Participated In Indias Got Latent 2: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న ఓటీటీ కామెడీ రియాలిటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' (India's Got Latent) సీజన్ 2 సరికొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా విడుదలైన రెండో ఎపిసోడ్‌లో ఒక విచిత్రమైన, నవ్వులు పూయించే సంఘటన జరిగింది. సాధారణంగా ఈ ఓటీటీ షోకి వింత వింత ప్రతిభ ఉన్న అండర్ గ్రౌండ్ కళాకారులు వస్తుంటారు. కానీ, ఈసారి ఏకంగా ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ ఖాకీ యూనిఫామ్ వేసుకుని, పూర్తి ఆయుధాలతో స్టేజ్ మీదకు రావడంతో హోస్ట్ సమయ్ రైనాతో పాటు ప్యానెలిస్ట్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఈ ఓటీటీ షో ఫార్మాట్ ప్రకారం కంటెస్టెంట్లు తమ హిడెన్ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ తమకు తాము మార్కులు ఇచ్చుకోవాలి. జడ్జీలు ఇచ్చే మార్కులతో అవి మ్యాచ్ అయితే ప్రైజ్ మ...