భారతదేశం, జూలై 5 -- OTT Series: ప్రస్తుతం తెలుగు ఓటీటీ రంగంలో వింటేజ్, నోస్టాల్జియా, మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఉన్న కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరుణంలోనే '90s కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్' నిర్మాణ భాగస్వామ్యంతో ఈటీవీ విన్ తీసుకొచ్చిన తాజా ఒరిజినల్ వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' అదరగొడుతోంది.

ఈటీవీ విన్ లో రిలీజైన గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సిరీస్ రిలీజైన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ఆదివారం (జూలై 5) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

పాత జ్ఞాపకాలను, చిన్ననాటి ముచ్చట్లను గుర్తు చేస్తూ ఫీల్ గుడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ తాజాగా ఏకంగా 100 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టిస్తోంది. ఈ సిరీస్ జూలై 3న ఈ...