భారతదేశం, జూన్ 22 -- OTT Series: వెస్టెరోస్ అద్భుత ప్రపంచంలోకి వీక్షకులను మరోసారి తీసుకెళ్లేందుకు 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' (HOTD) సీజన్ 3 సిద్ధమైంది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జూన్ 21న (భారత కాలమానం ప్రకారం జూన్ 22న) ఈ సూపర్ హిట్ సిరీస్ కొత్త సీజన్ ప్రారంభమైంది.

అమెరికాలో ఆదివారం రాత్రి 9 గంటలకు (ఈటీ) హెచ్‌బీఓ ఛానెల్‌తో పాటు 'మాక్స్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ విడుదలైంది. భారతదేశంలోని వెబ్‌సిరీస్ ప్రియుల కోసం ఈ సరికొత్త సీజన్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

జూన్ 22 నుంచి ప్రతి సోమవారం ఉదయం 6:30 గంటలకు (IST) కొత్త ఎపిసోడ్లు స్ట్రీమ్ అవుతాయి. ఈసారి ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించనుంది.

గత రెండు సీజన్లుగా తెర వెను...