భారతదేశం, అక్టోబర్ 1 -- OTT Romantic: సహజనటి జయసుధ (Jayasudha) మళ్లీ డిజిటల్ స్పేస్‌లో సందడి చేయడానికి గ్రాండ్‌గా రెడీ అయిపోయారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో రాబోతున్న సరికొత్త తమిళ మ్యాజికల్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ '#లవ్ ఆల్వేస్' (#LoveAlways)కి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది. అక్టోబర్ 30 నుంచి ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.

మొత్తం 7 ఎపిసోడ్‌లతో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ మధుమిత రూపొందించారు. గతంలో తమిళంలో 'కేడీ - ఎంగిర కరుప్పుదురై' (KD - Engira Karuppudurai) లాంటి అవార్డ్ విన్నింగ్ హార్ట్ టచింగ్ మూవీని అందించి నేషనల్ వైడ్‌గా ప్రశంసలు అందుకున్న మధుమిత.. ఇప్పుడు ఒక మ్యాజికల్ అండ్ లైట్ హార్టెడ్ రొమాంటిక్ కాన్సెప్ట్‌తో మన ముందుకు వస...