భారతదేశం, సెప్టెంబర్ 25 -- OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'షక్: ట్రస్ట్ నో వన్' (Shaque: Trust No One) ఇప్పుడు ఓటీటీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెన్సిల్ డిసిల్వా డైరెక్షన్‌లో వచ్చిన ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్ వీకెండ్‌లో చూడటానికి పర్ఫెక్ట్ థ్రిల్లర్‌గా నిలుస్తుందా? అసలు ఈ సిరీస్ కథేంటి? ఏ స్థాయిలో మెప్పించిందో క్లియర్‌గా చూద్దాం.

అన్వికా (పరిణీతి చోప్రా) హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే తన పసిపాప అపేక్ష కిడ్నాప్‌కి గురవుతుంది. ఆ బిడ్డ కోసం అన్వికా ఏళ్ల తరబడి వెతుకుతూనే ఉంటుంది. 9 ఏళ్లు గడిచినా, ఇంకో కూతురు పుట్టినా కూడా అపేక్ష జ్ఞాపకాలు ఆమెను నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు.

బిడ్డ కోసం పరితపించే అన్వికాని చూసి చుట్టుపక్కల వాళ్లు, చివరకు ఇంట్లోని వాళ్లు కూడా...